
MAKNEWS: కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారమై వెర జిల్లుతున్న ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లె గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ న కొబ్బరికాయలు ,లడ్డు, పులిహోర ,కొబ్బరి వక్కలు, పుట్నాలు, ప్యలాలు తో పాటుగా ఇతర వాటికి వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేవారు 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయం వద్దకు రావాలని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జాతర కార్యక్రమాలు జరగనున్నాయి.