
✍️Ⓜ️🅰️K NEWS
మురికి నీటీకాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచాలని ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు సూచించారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి..మురికి నీరు పేరుకుపోయి దుర్గంధం వస్తుండడంతో..కాలని వాసుల ఫీర్యాదుతో శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ రాజు పరిశీలించారు. వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాoకర్ తెప్పించి డ్రైనేజీ లో నిలిచిన మురుగు నీటిని, వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం సహాయంతో గ్రామప్రజల ఆరోగ్యం,పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని, అందులో భాగంగా గ్రామంలోని అన్ని వాడలలోని డ్రైనేజీలు, పరిసరాలను పరిశుభ్రం చేపిస్తనన్నారు. కాలనీ వాసులు సర్పంచ్ కు, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్,వార్డు సభ్యులు రాకం సుమన్,ఎర్రోజు దీపికా రవితేజ, సిబ్బంది ఎలుక రాము,కాలనీ వాసులు తిప్పారపు శ్రీనివాస్,దాసు,చాంద్,విఠల్,రవి,ధనుంజయ్,రాజు మహిళలు పాల్గొన్నారు.