maknews: ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని మాడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి గంగాధర్ తెలిపారు. 2025-2026 సంవత్సరానికి గాను 6, 7 ,8 ,10 పదవ తరగతి తో పాటగా ,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ,బైపీసి గ్రూప్ లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేసేందుకు విద్యార్థులకు ఆహ్వానం పలికినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీ వరకు పాఠశాల కార్యాలయంలో సీట్లు కావలసిన విద్యార్థులు సంప్రదించాలని పేర్కొన్నారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.