



రైలు బడి- ఎంపీపీ ఎస్ కందికట్కూరు (ఎస్సీ కాలనీ) పాఠశాలలో వనమహోత్సవం & కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO) వై శశికళ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని, సమయానికి వర్షాలు కురుస్తాయని ,సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా కిచెన్ గార్డెన్ పాఠశాలలో ఉండడం వలన ,పాఠశాల వంటకు కావలసిన కూరగాయలను సమకూర్చుకోవచ్చన్నారు. పాఠశాలను పర్యవేక్షించి కొనసాగుతున్న పలు కార్యక్రమాలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం రవీందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు అనువోజు రాజు, అంగన్వాడి టీచర్ లక్ష్మీ, గ్రామ కరోబారి శ్రీనివాస్,విద్యార్థులు పాల్గొన్నారు.