జిల్లాప్రధానకార్యదర్శి మీసం లక్ష్మన్
✍️Ⓜ️�️K NEWS
మిడ్ డే మీల్స్ కార్మికుల ధర్నా కోసం శనివారం ఎంఈఓ కార్యాలయం ముందు సమ్మె నోటీసు ను అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల కోడిగుడ్ల బిల్లులు గత పది నెలల నుండి రావడం లేదని, మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని , మధ్యాహ్న భోజన కార్మికులకు నిత్యవసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆగస్టు 6 ,7 తేదీలలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు . రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు 54,200 జీవిస్తున్నారు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే ఒక విద్యార్థికి స్లాబ్ రేట్ 25 రూపాయల ఖర్చు వస్తుంది ,ఒక్కో విద్యార్థి కి 25 రూపాయలు చెల్లించాలని లేదా సరుకులు సప్లై చేయాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెనూ చార్జీలు పెంచాలని రెండు కూరలు వడ్డించాలంటే అదనపు చార్జీలు చెల్లించాలని ,గ్యాస్ పోయిలు ఇవ్వాలని, వంట పాత్రలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ ఆగస్టు 6 7 తేదీలలో వంటలు బంద్ చేసి రెండు రోజులు నిరసన ప్రదర్శనలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయే ధర్నాని చెప్పడం చేయాలని జరుగుతుంది బిల్లులు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో నర్సవ్వ, సంతోష బాలమణి, లత ,రేణుక, లక్ష్మి నరసవ్వ రాజవ్వ మమత తదితరులు పాల్గొన్నారు.