
✍️Ⓜ️🅰️K NEWS
శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన విభాగాలను ఆలయ కార్యనిర్వహణాధికారి రాధా బాయి ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెయిన్ టెంపుల్, ప్రసాద తయారీ విభాగం, ప్రసాద విక్రయ విభాగం, ప్రోటోకాల్ విభాగం, సెంట్రల్ గోదాం, బుకింగ్ కౌంటర్, ప్రచార శాఖ, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణ తీరును ఆమె సమీక్షించారు.
అధికారులు మరియు సిబ్బందితో సమావేశంలో ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వామివారికి నివేదించే ప్రసాదం శుద్ధి, ప్రమాణాల పరంగా లోపం లేకుండా ఉండేలా చూడాలని ఆమె సూచించారు.
సెంట్రల్ గోదాంలో సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, టికెట్ కౌంటర్లలో జరిగే లావాదేవీలు, సమాచార కేంద్రాల్లో భక్తులకు అందే సేవలపై సమీక్ష జరిపారు. టికెట్ల జారీ విధానం సక్రమంగా కొనసాగాలని, ఉద్యోగులంతా సమయపాలన పాటించాలనీ స్పష్టంగా తెలిపారు.
భక్తుల సమాచార కేంద్రంలోని సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరించాలనీ, ప్రసాద నాణ్యతలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ సరైన విధంగా కొనసాగించాలన్నది ఆమె సూచించారు.

good