
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన దళిత కుంటుంబానికి చెందిన కడగండ్ల తిరుపతి డిల్లీలో తన గళాన్ని వినిపించాడు.సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ గల్లీ లోని యువకుడు,యువ న్యాయవాది అయిన కడగండ్ల తిరుపతి డిల్లీ లో నిర్వహించిన సదస్సులో తన ప్రెజెంటేషన్ ఇవ్వడం తో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు,దృక్పథం,సవాళ్లు అనే అంశం పై శనివారం నిర్వహించిన డిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ కడగండ్ల తిరుపతికి అరుదయిన అవకాశం దక్కింది. శనివారం ఉదయమే ఢిల్లీ కి చేరుకున్న అడ్వకేట్ తిరుపతి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లోని న్యాయవాదుల సదస్సులో పాల్గొని తన అభిప్రాయాలను వివరించారు.రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పై,రాజ్యాంగం దృక్పథం ,పరిష్కారాల కు తనవంతు సూచనలు ,సలహాలు వినిపించాడు.ఈ సదస్సులో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతలు,అనేక మంది సీనియర్ న్యాయ వాదులు, సీనియర్ రాజకీయ నేతల ముందు తాను మాట్లాడే అవకాశం దక్కించుకున్న యువ అడ్వకేట్ కడగండ్ల తిరుపతిని మండల వాసులు అభినందిస్తున్నారు.
