
ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుమ్మరవేణి రాజు 40 ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ బుధవారం మృతుడి స్వగ్రామం సిరికొండకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పలువురు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.