
ఆత్మస్థైర్యంతో వికలాంగుడి నామినేషన్
-ఓగులాపూర్ గ్రామంలో వార్డు సభ్యునిగా నామినేషన్
MAKNEWS/ఇల్లంతకుంట(ఓగులాపూర్)
ఆత్మస్థైర్యంతో…పట్టుదలతో ఓ వికలాంగుడు తనకు నడవడానికి రాలేకపోయినా… రాజ్యాంగం కల్పించిన ఓటుతో గ్రామ పంచాయతీలో వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన సమ్మెట సతీష్ అనే వికలాంగుడు.. రెండు కాళ్ళను చిన్ననాడే పోలియో మహామ్మారి రూపంలో కోల్పోయాడు. దీంతో ఆత్మస్థైర్యం సన్నగిల్లకుండా ,తనకు తాను జీవనోపాధి కల్పించుకుంటూ ,తన కుటుంబాన్ని పోషించుకుంటూ ..వస్తున్నాడు. అయితే స్థానిక సంస్థలు పోటీ చేసేందుకు గ్రామంలో రెండో వార్డు జనరల్ స్థానానికి కేటాయించారు. దీంతో తను బీసీ కుటుంబానికి చెందిన తను వార్డు సభ్యునిగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ప్రస్తుతం తను పోటీ చేస్తున్న వార్డులో 164 ఓట్లు ఉన్నాయి. బరిలో ప్రస్తుతం తనతో పాటుగా మరొకరు పోటీ చేస్తున్నారు. ఈనెల 14న ఎన్నికలు ఉండగా ఆ రోజే గెలుపోవటములు తెలియనున్నాయి.