
MAKNEWS ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా లో ట్రాక్టర్ ఢీ కొట్టడంతో విద్యుత్ హై టెన్షన్ పోల్ విరిగిపడింది. పక్కనే ఉన్న భవనంపై పోల్ పడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్ ను ఒక్క సారిగా ఎదురుగా వచ్చిన బ్లేడ్ ట్రాక్టర్ ఢీ కొట్టడంతో సగం విరిగి కింద ఒరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపివేశారు. విద్యుత్ పోల్ విరగడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో సర్పంచ్ మామిడి రాజు, వార్డు సభ్యుడు రాకం సుమన్, తో పాటుగా ఇతర వార్డు సభ్యులు,సెస్ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపడుతున్నారు.