
✍️Ⓜ️🅰️K NEWS
మానకొండూరు అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి పార్టీ సత్తా చూపిస్తామని, అన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేసి ,అభ్యర్థులను గెలిపించుకుంటామని బిజెపి మానకొండూరు నియోజకవర్గం అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్ అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల తయారీ లో భాగంగా భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండల లోనీ రహీంఖాన్ పేట (రాముల వారి పేట) గ్రామంలో ఇంటింటికి బిజెపి- ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ, ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం సుసంపన్న దేశంగా ఎదుగుతూ , ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదగడం, భారతీయుడుగా మనం గర్వపడాల్సిన విషయమన్నారు.
పేద ప్రజలకు ప్రతినెల ఉచిత బియ్యం, భూమి ఉన్న ప్రతి రైతుకు కిసాన్ సమ్మన్ నిధి నుంచి 2000 రూపాయలు ఇస్తున్నమన్నారు. అలాగే పేదవారికి మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, గ్రామాలలో వీధి దీపాలు, సిసి రోడ్లు, మరియు స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలకు, అలాగే రైతులకు వాటర్ డ్రిప్ సిస్టం ,రైతన్నలకు సబ్సిడీ కింద ఎరువులు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశంలో ఉన్న పేదవారి మోడీ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిప్పరపు శ్రవణ్, ఉపాధ్యక్షుడు గుంటి మహేష్, చిమ్మనగోట్టు శ్రీనివాస్, దండవేణి రజినీకాంత్, బిజెపి నాయకులు అమ్ములు అశోక్, దుద్దెడ రాజు, కొలనూరు ముత్తక్క,గౌరవేణి శ్రీనివాస్, గొడుగు రాజు,ధరిపెల్లి హరీష్ తిప్పరవేని మధు ,తదితరులు పాల్గొన్నారు.
