
✍️Ⓜ️🅰️K NEWS
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ఎంతోమంది బలయ్యారు..
జవారిపేటలో పోలీసుల స్పేషల్ డ్రైవ్
“మీకోసం” కార్యక్రమంలో సిరిసిల్ల సిఐ మొగిలి
ఇల్లంతకుంట/జవారిపేట:
యువత ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లతో, ఆన్ లైన్ గేమింగ్ యాప్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి అన్నారు. ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో “మీకోసం” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఎక్కువ శాతం ఆన్ లైన్ బెట్టింగ్ లతో తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అప్పులు చేసి బెట్టింగ్ యాప్ లో పెట్టి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని, చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా వింటున్నామన్నారు. అదేవిధంగా ఆన్ లైన్ గేమ్ ల ద్వారా యువత చాలా డబ్బులు నష్టపోతున్నారని , వీటితో యువతకు చాలా ప్రమాదం ఉందని, వీటికి దూరం ఉండాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్ ఆడకుండా చూడాలని, సిఐ సూచించారు. గ్రామంలో ఆన్ లైన్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమింగ్ లు ఎక్కువ గా ఆడుతున్నట్టుగా, తమ దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మంచి మార్గాన్ని ఎంచుకొని బంగారు భవిష్యత్తు ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జాబులను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస రావు, పోలీస్ సిబ్బంది ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
