
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా బద్దం రవీందర్ రెడ్డి
✍️Ⓜ️🅰️K NEWS
పోరాటాల పురిటిగడ్డ గాలి పెల్లి గ్రామానికి చెందిన “బద్దం రవీందర్ రెడ్డి” ఎస్ జి టి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా బద్దం రవీందర్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులను వెలుపరిచారు. కందికట్కూర్ ఎస్సీ కాలనీ రైలు బడిలో బద్దం రవీందర్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పాఠశాలను రైలు బడిగా మార్చి రాష్ట్రంలోనే మాడల్ గా స్థానం పొందగా, పలు సేవా కార్యక్రమాలను చేస్తూ పాఠశాల విద్యార్థులకు వినూత్న రీతిలో బోధనను, అందిస్తూ మండలంలో అందరి మందనలు పొందుతున్నాడు. బడిబాట కార్యక్రమంలో రైలు “రైలు బడి కి” మీ పిల్లలను పంపించి, మంచి భవిష్యత్తును నిర్ణయించండి, అంటూ క్యాంపెయిన్ చేశారు. అదేవిధంగా మన దేశ సాంస్కృతి, సాంప్రదాయాలను, ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా, వారికి ,మన పండుగలను, వేషధారాలను, వేయించి మరి విద్యాబోధన అందిస్తూ ..రవీందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు. ఎస్ జి టి ఉపాధ్యాయుడు బద్దం రవీందర్ రెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావడం పట్ల మండల ఉపాధ్యాయ సంఘం నాయకులు ,తోటి ఉపాధ్యాయులు, కందికట్కూరు గ్రామస్తులు ,విద్యార్థులు, గాలి పెల్లి, వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.