
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో “గణేష్ ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలం రికార్డు స్థాయిలో వేలం దక్కించుకున్నారు.. నవరాత్రులు పూజలందుకున్న లడ్డును గ్రామానికి చెందిన అరకుటి దేవయ్య రూపాయలు 39 వేలకు దక్కించుకున్నారు. మొత్తం ఈ లడ్డు వేలంలో 14 మంది పాల్గొన్నారు. చివరకు ఎక్కువ మొత్తంలో 39 వేలకు దేవయ్య లడ్డు దక్కించుకోగా ,గత ఏడాది ఇదే గణనాథులు వద్ద లడ్డు వేలం వేయగా 32 వేలకు వేలంలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.