
అడిషనల్ ఎస్పీ చంద్రయ్య maknews
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇల్లంతకుంట మండలంలోని ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ దాఖలు చేసిన కేంద్రాలను సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య గురువారం పరిశీలించారు. పెద్ద లింగాపూర్ ,ఇల్లంతకుంట, వంతడుపుల ,గాలి పెల్లి, పొత్తూరు ,నామినేషన్ కేంద్రాలను ఆయన సిబ్బందితో ,కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో ఉన్న ఆర్వో, ఏ ఆర్ ఓ లతో మాట్లాడారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఫసియుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ ,బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.