
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో కొండచిలువ కలకలం సృష్టించింది. పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన దర్శనం కొమురయ్య రోజువారీగా తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. వరి చేనులో అలజడి గమనించిన కొమురయ్య మెల్లిగా చూడడంతో కొండచిలువ కనిపించింది. దీంతో ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటకు వచ్చి, స్థానికులను చుట్టుపక్కల వారిని పిలిచాడు. స్థానికుల సహాయంతో కొండచిలువను బయటకు తీసి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం కొండచిలువను తీసుకొని ఊరి చివరలో వేసినట్లు తెలిపారు.