
బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామి
(ఇల్లంతకుంట MAKNEWS)
ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్ నుంచి అనంతారం పెద్ద చెరువులోకి నీళ్లు విడుదల చేసి బిక్కవాగు, రహీంఖాన్ పేట సింగరాయ చెరువులోకి నీళ్లు వచ్చేలా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించాలని బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామిగౌడ్ కోరారు. చెరువులు,బావులు,బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోయి సాగునీళ్లు లేక పంటలు ఎండిపోక ముందే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.