
ఇల్లంతకుంట పట్టణ యువజన సంఘాల అధ్యక్షునిగా రేగుల కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ అధ్యక్షతన శనివారం స్థానిక వైశ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎంపిక కోసం ప్రతిపాదనలు రాగా, యువజన సంఘాల సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఇల్లంతకుంట వార్డు సభ్యుడు, రేగుల కార్తీక్ ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అనంతరం కార్తీక్ మాట్లాడుతూ యువజన సంఘాల బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. యువత రాజకీయాలకు రావాలని, అదేవిధంగా సమాజ సేవలో కూడా యువత తమ వంతు పాత్ర పోషించాలన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తారని కార్తీక్ పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, కూనబోయిన బాలరాజు, కొయ్యడ భాస్కర్, యువజన సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.