
చదువు మానేసిన వారితో, పాటుగా బడికి వెల్లని పిల్లలందరినీ తిరిగి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని, ఇల్లంతకుంట విద్యాధికారి చెప్పాల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని ఎం ఆర్ సి లో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల ఆర్గనైజర్స్ తో పాటుగా, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద లింగాపూర్ ప్రధాన ఉపాధ్యాయుడు ,రిసోర్స్ పర్సన్ గుర్రం సందీప్ రెడ్డి, యాద రవి లు నవభారత సాక్షారత పై.. అవగాహన లో భాగంగా వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.