
✍️Ⓜ️🅰️K NEWS మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి సరైన బస్ సౌకర్యం లేక గత కొన్ని రోజులుగా ప్రజలు, ప్రయాణీకులు తీవ్రఇబ్బందులు పడ్డారు. వర్షందాటికీ రోడ్డుమొత్తం కుంగడంతో బస్సులు నడవలేనిస్థితి, దీంతో తిరిగి బస్సులను రప్పించాలనే సంకల్పంతో, గుంతలతో నిండిన రహదారిని బాగుచేయడానికి మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సీంహా రెడ్డి నేతృత్వంలో ఆధ్వర్యంలో , ట్రాక్టర్ యాజమానులు, గ్రామస్థులు నడుంబిగించారు. రాఖీ పండుగ రోజు జేసిబీ తో , ట్రాక్టర్ల సహయంతో రహదారిపై మట్టి వేసి గుంతలను పూడ్చి,ప్రయాణీంచేల చదునుచేశారు.ఈ కార్యక్రమంలో సహకరించిన జేసిబీ యాజమాని కుర్ర రమేష్ ,బ్లేడ్ ట్రాక్టర్ యజమానులు పండుగ భాస్కర్ ,కడుదుల రాజయ్య గారు భాషా,గుర్రం భూమిరెడ్డి ,ట్రాక్టర్ యజమానులు,ఒగ్గు రామకృష్ణ,కట్ట శ్రీకాంత్ రెడ్డి,కర్ల వేణు గారు,కుర్ర రఘు,ముద్దాల అభిషేక్, నాయిని ,మారుపాక వంశీ,లకపాక నర్సయ్య, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉన్నాయి.ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకవెళ్లిన గ్రామానికి చెందిన “మొగ్గం ప్రమోద్” అనే యువకుడిని అభినందిస్తున్నారు. సోమవారం నుండి యధావిధిగా బస్సులను పునరుద్దరిస్తామని డిపో మేనేజర్ తెలినట్లు ప్రమోద్ తెలిపారు.

