
✍️Ⓜ️🅰️K NEWS ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఆర్ఎస్ ఎస్ జిల్లా వ్యవస్థ ప్రముఖ్ మండే మల్లికార్జున స్వామి హాజరయ్యారు. రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరించి, సోదర–సోదరీమణుల బంధాన్ని సాంప్రదాయాల పరిరక్షణలో సమాజం పాత్రను వివరించారు. పంచ పరివర్తన అంశాలైన పర్యావరణ పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ బలోపేతం, సామాజిక సమరస్యత, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, పౌర నియమాల పాటించటం గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఖండ కార్యవహా తాటిపెల్లి మహేష్, కాసుపాక కిషన్, నాగసముద్రాల బాలకృష్ణ, బొల్లం ధనుంజయ్, కంకటి శ్రీకాంత్, స్వయం సేవకులు పాల్గొన్నారు.