
✍️Ⓜ️🅰️K NEWS రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో ఆదివారం శ్రీ మడలేశ్వర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశ నిర్వహించారు. రజక సంఘం గ్రామ అధ్యక్షునిగా అంతగిరి శ్రీనివాస్ ను ఏగగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా తాడూరి మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా తాడూరి అనిల్, కోశాధికారిగా తాడూరి అనిల్, కార్యవర్గ సభ్యులుగా చంద్రశేఖర్ ,ప్రశాంత్ ప్రకాష్ లచ్చయ్య రవి అనంతగిరి పరుశురాం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన అధ్యక్షులు అంతగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, గ్రామంలో మండలంలో సంఘానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.