తాళ్లపెల్లి-బేగంపేట మధ్యన నిలిచిన రాకపోకలు
చేపలు పడుతున్న పరిసర ప్రాంత వాసులు

✍️Ⓜ️🅰️K NEWS గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు ధాటికి వరదనీరు కాస్త ముంచెత్తుతుంది. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామం నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో తాళ్లపల్లి-బేగంపేట, ప్రధాన రహదారి వరద నీటితో నిండిపోయింది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఓవైపు ఆదివారం కావడంతో గ్రామస్తులు పరిసర ప్రాంత వాసులు రోడ్డుపై వలతో, గ్యాలాలు వేసి చేపలు పడుతున్నారు.