
🔷 ర్యాంకర్ మహేష్ కు రూ. 5.22 లక్షల సాయం
🔶 బ్యాంక్ డిపాజిట్ సర్టిఫికెట్ అందజేత
🔷మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి
✍️Ⓜ️🅰️K NEWS
విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో నీట్ లో జాతీయస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన గంగిపల్లి గ్రామానికి చెందిన మార మహేశ్ అనే విద్యార్థికి విరాళాల ద్వారా సేకరించిన 5.22 లక్షలరూపాయల డిపాజిట్ సర్టిఫికేట్ ను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ర్యాంకర్ మహేశ్ కు అందించిన కార్యక్రమంలో సతీమణి డాక్టర్ అనూరాధ తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే విద్యలో రాణిస్తారని, తద్వారా జీవితంలో ఉన్నతమైన జీవితం గడుపుతారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు మాత్రమే ర్యాంకులు సాధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదవే విద్యార్థులు కూడా జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారని, నీట్ లో జాతీయస్థాయిలో 17వ ర్యాంకుసాధించినమార మహేశ్ ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే పేరెన్నికగన్న తమిళనాడులోని తిరుచాపల్లి కళాశాలలో ఆర్కెటెక్ విభాగంలో చేరబోతున్న మహేష్ ను ఎమ్మెల్యే అభినందించారు. చదువుల్లో రాణిస్తున్న పేద విద్యార్థులకు చేయూతనివ్వాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. విద్యార్థుల చదవుకు పేదరికం అడ్డు కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మహేష్ కు ఆర్థిక సహాయ మందించిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ కూడా చదువుల్లో మరింత రాణించాలని, భవిష్యత్తుల్లో ఇతరకు సాయపడే విధంగా ఎదగాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆకాంక్షించారు.ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల, కళాశాల్లోనే చదివిలో నీట్ లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదని, అది మానకొండూర్ నియోజకవర్గానికే కాకుండా మన జిల్లాకు గర్వకారణమన్నారు. మహేశ్ ను చూసి విద్యార్థులు స్ఫూర్థి పొందాలన్నారు. ఎమ్మెల్యే సతీమణి విరాళంమానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ అనూరాధ లక్షా 50 వేల రూపాయల విరాళం అందించారు. 1987 మెడిసిన్ బ్యాచ్మెట్ల తో కలిసి సేకరించిన ఈ మొత్తాన్ని కూడా మహేష్ కు అందించిన 5.22 లక్ష రూపాయల్లోనే కలిపి డిపాజిట్ చేయడం జరిగింది. దీంతో మహేష్ ఐదేళ్ల కోర్సు కు సంబంధించిన చెల్లించాల్సిన పూర్తిస్థాయిలో ఫీజులు మొత్తాలు సమకూరినట్టయింది. ఫీజులకు పోగా మిగిలిన డబ్బును మహేష్ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవాలని నిర్దేశించారు.
ఎమ్మెల్యే దంపతులకు సన్మానం
పేద విద్యార్థి మహేష్ భారీ స్థాయిలో విరాళం సేకరించేందుకు దోహదపడిన మానకొండూర్ ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ కవ్వంపల్లి అనూరాధ లకు యూటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు ముల్కల కుమార్ శాలువాతో సత్కారించారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్రి ఓదెలు యాదవ్, పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గంగిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, పార్టీ నాయకులు రామిడి తిరుమల్ రెడ్డి,వాల అంజుత్ రావు, ముక్కెర సతీష్ కుమార్,డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కనకం లక్ష్మణ్, ముల్కల కుమార్, గొల్లెన కొమురయ్య, బండి మల్లేషం,బైరం సంతోష్, చెప్యాల శ్రీనివాస్, బుర్ర చంద్రాకర్ తదితరులు ఉన్నారు.
