
✍️Ⓜ️🅰️K NEWS
🔸జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సాక్షిగా రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇస్తామన్న 42శాతం రిజర్వేషన్ల అమలు మాగలు వట్టి నీటిమూటలేనని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు.ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధం వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలపడం లేదని మాటలు మార్చుతున్నారని దుయ్యబట్టారు.సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి 50 సార్లు ఢిల్లీకి పోయివచ్చాడు నయాపైసా నిధులు తెలేదు… బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ లోని బీసీలను మోసం చేస్తున్నాడని అన్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గాలిమాటలు మాట్లాడుతున్నారని…రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు…. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరనేది చెప్పకుండానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కూనబోయిన రఘు,ర్యాగటి రమేష్, మెరుగు రాజు గౌడ్, బెంద్రం తిరుపతిరెడ్డి, పుట్ట చంద్రశేఖర్ రెడ్డి, నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు