
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను ఇల్లంతకుంట మండల బిజెపి నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం తన కార్యాలయంలో మండల నాయకులు కలిశారు. ఇల్లంతకుంట బస్టాండ్ లో నిత్యం రద్దీగ ఉంటుందని ,అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేందుకు వస్తారని వారు పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు లేకపోగా కనీసం, సులబ్ కాంప్లెక్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాకాలం దృష్ట్య మహిళలు తీవ్రంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సులబ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండికి విన్నవించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సానుకూల సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మానకొండూరు నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రావణ్ ,మండల ఉపాధ్యక్షులు గుంటి మహేష్ , సీనియర్ నాయకుడు చిమ్మనగోట్టు శ్రీనివాస్ ,బీజేవైఎం మండల అధ్యక్షుడు వజ్జపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.