
maknews
-కెనాల్ నిర్మాణం కోసం రూ.3కొట్ల19 మంజూరుకు హామి..
కాలేశ్వరం 11వ ప్యాకేజీ లో భాగంగా ఎల్ఎం -6 కెనాల్ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో రైతులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కలసి వారి సమస్యలను వివరించారు. కెనాల్ నిర్మాణం కోసం సుమారుగా రూ.3 కోట్ల 19 లక్షలు ఖర్చు అవుతుందని, వెంటనే నిధులను మంజూరు చేయాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే, రైతులు తెలిపారు.నిధులు మంజూరు చేసి, త్వరలోనే పనులు చేపట్టుతామని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, ఐరెడ్డి మహేందర్ రెడ్డి,పాశం రాజేందర్ రెడ్డి, పసువుల వెంకన్న, కేతిరెడ్డి నవీన్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రెడ్డి, రైతులు అమ్ములు అశోక్, మధు, తో పాటుగా 20 మంది రైతులు పాల్గొన్నారు.