
maknews విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలి
-దాచారం హైస్కూల్లో వీడ్కోలు హంగామా
-పాల్గొన్న విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఇల్లంతకుంట విద్యాధికారి చెప్పాలా శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఇల్లంతకుంట మండలంలోని దాచారం హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇల్లంతకుంట విద్యాధికారి చెప్పాల శ్రీనివాస్ గౌడ్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం ఎంఈఓ కు పాఠశాల ఉపాధ్యాయులు ఘన సన్మానం నిర్వహించారు. వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలకు నృత్యాలు చేస్తూ ఉర్రూతలు ఊగించారు. విద్యార్థులు వేసిన స్టెప్పులు చూపరులను హోరెత్తించాయి. దాచారం సర్పంచులు కుడుముల రేణుక నాగరాజు, శివాని సుమన్, ప్రధానోపాధ్యాయురాలు రాణీ, తుంకుంట నరేెందర్ రెడ్డి, శ్రీను, దావిద్, శ్రీనివాస్, సురేష్, సంజీవ్, శ్రవణ్, ముత్యాలు, ఉపసర్పంచ్ అనిత విక్రమ్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
