
సింగిల్ విండో సోసైటిలో గన్ని బ్యాగుల మయాజాలం
-గన్ని బ్యాగుల పేరిట లక్షల్లో అక్రమాలు
-ఆధారలతో వెల్లడించిన గన్నారం నర్సయ్య
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గన్ని బ్యాగుల మయాజాలం ఒక్కసారిగా బయటపడింది. సోసైటిలో గన్ని బ్యాగుల కొరత పేరిట లక్షల రూపాయల్లో అక్రమాలు జరుగుతున్నాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గన్నారం నరసయ్య ఆరోపించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సోమవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. సొసైటీ వడ్ల కొనుగోలు వై వచ్చిన కమిషన్ గన్ని బ్యాగుల సమాచారం కోసం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుండి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన సమాచారంలో గన్ని బ్యాగుల కోరత చూపిస్తూ గత మూడు సంవత్సరాల నుండి ఏడు సీజన్ లలో 80 లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. వీటికి సంబందించిన ఆర్టీఐ పత్రాలు, సోసైటి సిఓ ఇచ్చిన పూర్తి పత్రాలే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఇల్లంతకుంట సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా కలెక్టర్ ,ఉన్నత స్థాయి అధికారులు పూర్తి విచారణ చేయాలని లేని పక్షంలో ధర్నా కార్యక్రమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
