
పెద్దలింగాపూర్ లో యూరియ కొరత
-యూరియా కోసం బారుతీరిన రైతులు
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలంలో యూరియ కొరత తీవ్రంగా నెలకొంది. యూరియ బస్తాలు రైతులకు అందించేందుకు సోమవారం పెద్దలింగాపూర్, ఇల్లంతకుంట సోసైటి, ముస్కానిపేట గ్రామాలతో పాటుగా ఆయా గ్రామాలలో పంపిణీ ఏర్పాట్లు చేశారు. అయితే పెద్దలింగాపూర్ లో కేవలం 10 టన్నుల యూరియ (230 బస్తాలు) లే రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 400 లకు పైగ రైతులు పంపిణీ కేంద్రం వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు. కానీ తక్కువగా యూరియా బస్తాలు రావడంతో కేవలం ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో , మిగితా వారికి నిరాశ ఎదురైంది. దీంతో యూరియ బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి పంపిణీ కేంద్రం వద్దకు వచ్చి రైతులకు నచ్చజేప్పారు. ఇల్లంతకుంట సోసైటిలో 230 బస్తాలు, ముస్కానిపేటలో 230 బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నామని, పెద్దలింగాపూర్ సో మాత్రం యూరియ కొరత ఉందన్నారు. ఆర్ఎఫ్ సిఎల్ లో యూరియా తయారీ నిలిచి పోవడంతో కొరత ఏర్పడిందని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో యూరియ రైతులకు అందజేస్తామన్నారు. రైతుల ఆందోళన నేపధ్యంలో ఎస్ఐ సిరిసిల్ల అశోక్ నేతృత్వంలో,హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి, సిబ్బంది బందోబస్త్ ఏర్పాటు చేశారు.
