
maknews(పొత్తూరు)
పేరుకు పెద్ద మండలం ….
👉తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ కుర్చీ ఖాళీ…
👉మండల పరిషత్ కార్యాలయంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు విధులు బహిష్కరించిన పట్టించుకోరు…
👉జిల్లా ఉన్నత అధికారులు జర మా మండలాన్ని పట్టించుకోండి….
పొత్తూరు సర్పంచ్ పట్నం అశ్విని శ్రీనివాస్
ఇల్లంతకుంట మండలంలో తాహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ లేక మండల ప్రజలు చిన్న చిన్న సర్టిఫికెట్లకు కూడా ఇబ్బందులు పడుతున్నారని ప
జిల్లాలోనే ఎక్కువ గ్రామాలు ఉన్న మండలంలో డిప్యూటీ తాహాసిల్దార్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ,వెంటనే ఇల్లంతకుంట మండలానికి డిప్యూటీ తాహాసిల్దార్ని ఇవ్వాలని పొత్తూరు సర్పంచ్ పట్నంఅశ్విని కోరారు.
జిల్లాలోనే ఎక్కువ గ్రామాలు ఉన్న ఇల్లంతకుంట మండలంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు విధులు బహిష్కరించడం వల్ల గ్రామపంచాయతీలో ఉన్న నిధులను వాడుకోలేని దుస్థితిలో కేవలం ఇల్లంతకుంట మండలం మాత్రమే ఉంది. మిగతా మండలాల్లో ఈ పంచాయతీ ఆపరేటర్లతో మండల ఉన్నతాధికారులు మాట్లాడి వారిని విధుల్లోకి తీసుకున్నారు. గ్రామపంచాయతీల్లో ఇప్పుడు జమైన నిధులను మొత్తం ఖర్చు చేస్తేనే మిగతా నిధులు జమ అవుతాయి. ఈ విషయం అధికారులకు తెలిసి కూడా ఈ పంచాయతీ అధికారులతో సమన్వయం చేయలేకపోతున్నారు. మండల ప్రజలకు కూడా ఈ పంచాయతీ ఆపరేటర్ల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రాలేక ఇబ్బంది పడుతున్నారు. కావున జిల్లా అధికారులు ఇల్లంతకుంట మండలం పై దృష్టి పెట్టి పై సమస్యలను వెంటనే తీర్చాలని కోరారు.