
– 50 బస్తాలతో పట్టుబడ్డ వాహనం
–వాహనం సీజ్ చేసిన వ్యవసాయాధికారి
–“మన గ్రోమోర్”పై చర్యలకు కలెక్టర్ కు నివేదిక
మానకొండూర్ ✍️Ⓜ️🅰️K NEWS
రైతు గంటల తరబడి క్యూలైన్ లో నిలబడితేనే ఒక్క యూరియా బస్తా దొరికే పరిస్థితి లేదు.అలాంటిది ఏకంగా 50 యూరియా బస్తాలు మినీ గూడ్స్ వాహనంలో లోడ్ చేసి హన్మకొండ జిల్లా పరకాలకు అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు మండల వ్యవసాయ అధికారి యూరియా బస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసి మానకొండూర్ పోలీసులకు అప్పగించారు.వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు..మానకొండూర్లోని మన గ్రోమోర్ ఎరువుల గోదాం ఇంచార్జి శుక్రవారం రాత్రి 50 యూరియా బస్తాలను మినీ గూడ్స్ వాహనంలో లోడ్ చేయించి పరకాలకు తరలించే యత్నంలో స్థానికులు మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించారు.వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి మానకొండూర్లోని మన గ్రోమోర్ ఎరువుల స్టోర్ వద్దకు చేరుకొని యూరియా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి మానకొండూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.ఈ సందర్బంగా ఏఓ మాట్లాడుతూ..మన గ్రోమోర్ స్టోర్ నుండి 50 యూరియా బస్తాలు అక్రమంగా తరలిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో వాహనం సీజ్ చేసామని తెలిపారు.సీజ్ చేసిన వాహనం పోలీసు స్టేషన్ కు తరలించామన్నారు.మన గ్రోమోర్ స్టోర్ లోని స్టాక్ రిజిస్టర్,ఈ మిషన్ సీజ్ చేశామని తెలిపారు.1952 ఎరువుల బస్తాలతో పాటు సుమారు రూ. 20 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేసి మన గ్రోమోర్ పై తదుపరి చర్యలకు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేయనున్నట్లు ఏఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.