
✍️Ⓜ️🅰️K NEWS
ఇల్లంతకుంట మండలం గాలి పల్లి గ్రామానికి చెందిన అరకుటి మల్లేశం అనే ఉపాధ్యాయుడు ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు) ఉపాధ్యాయ సంఘంలో అరుకుటి మల్లేశం క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆరుకుటి మల్లేశం మండలంలోని ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, సంఘ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. మల్లేశం నియామకం పట్ల మండలంలోని పలు ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.