
-20 విడుతల్లో 1129 మందికి రూ.2.93 కోట్ల సాయం
-చెక్కులు పంపిణీ లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెల్లడి
maknews/ఇల్లంతకుంట ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పేద,మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తున్నదని, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయ కార్యాలయంలో 71 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం, ప్రైవేటు దవాఖానా లో వెద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆర్థికంగా,చేయూతనందించేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం, అందిస్తున్నదన్నారు. గతంలో మాదిరి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఇల్లంతకుంట మండలంలో ఇప్పటి వరకు 20 విడుతల్లో 1129 మందికి 2,93,00,500 రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేశామన్నారు. కాగా, 20 విడుతలో 71 మందికి 18,16,500 రూపాయలు మంజూరు కాగా, వాటిని ఇప్పుడు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై శశికళ, తహాసీల్దార్ ఏంఎఫారుఖ్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యమహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎనగందుల ప్రసాద్, పార్టీ నాయకులు పసుల వెంకటి,తీగల పుష్పలత, వెలిశాలజ్యోతి, మామిడిసంజీవ్,ఎంరాజు,కడగండ్లతిరుపతి, కాత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.