
మద్దతుధరకే ధాన్యం కోనుగోళ్లు
-ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపెల్లి
maknews/ఇల్లంతకుంటప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని, రైతుసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు.సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్,చిక్కుడువానిపల్లి, అనంతారం,ముస్కానిపేట,గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ఐకేపీ,సింగిల్ విండోల సోసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “వరి ధాన్యం” కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యం మద్దతు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందని, ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369కు కొనుగోలు చేయాలని నిర్ధేశించిన దృష్ట్యా దీని ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. వర్షాల సాకుతో దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే లబ్ధిపొందాలన్నారు.ధాన్యాన్ని భద్రపరిచేందుకు వీలులేకపోవడాన్ని అదునుగా చేసుకున్న కొంత మంది దళారులు పొలాల వద్దే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. దళారుల మోసాలకు గురికావొద్దని ఆయన రైతులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ ఏంఎఫారుఖ్, సోసైటీ చైర్మన్ రోండ్లతిరుపతిరెడ్డి,
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యమహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొడుగుతిరుపతి, ఎనగందుల ప్రసాద్, పార్టీ నాయకులు తాట్ల వీరేశం, కేతిరెడ్డి వెంకటరెడ్డి,పసుల వెంకటి, అంతగిరి,డైరెక్టర్లు, డిసిసి వైస్ ప్రెసిడెంట్ తీగల పుష్పలత, అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి,మామిడి రాజు, , మామిడి సంజీవ్, కాత మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.