
బీజేపి మాజీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పల్లె దవాఖానాకు వెళ్లే దారి “కరువవ్వడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపి మండల శాఖ మాజీ అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ ఆరోపించారు. పల్లేధవఖానాకు అత్యవసర వైద్య సేవలు పొందడంలో రోగులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమై, రోగులను తరలించడం దాదాపు అసాధ్యమవుతుందని, రోజూ వందలాది మంది వైద్య సేవల కోసం వస్తున్నా, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. అన్న ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు. గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడే పల్లె దవాఖానాకు దారి సమస్య పై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.