

ప్రకృతిలో త్రివర్ణ తేజస్సు – అనంతగిరి విద్యార్థిని సృజనకు అందరి ప్రశంసలు
✍️Ⓜ️🅰️K NEWS
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అనంతగిరి లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో 10 వ తరగతి విద్యార్థిని వి. శ్రీవిద్య తన కళా ప్రతిభను వినూత్నంగా ఆవిష్కరించింది.సూర్యోదయం యొక్క కాంతిమయమైన నారింజ రంగు, స్వచ్ఛమైన నీలి ఆకాశం, పచ్చని పంట పొలాలను ఒకే చిత్రంలో సమన్వయం చేసి, దేశ జాతీయ పతాకం రంగులను ప్రకృతి సోయగాలతో కలిపినట్లు అద్భుతంగా చిత్రించడం జరిగింది.ఈ చిత్రం చూసిన ప్రతిఒక్కరూ విద్యార్థి సృజనాత్మకతను, దేశభక్తిని ప్రశంసించారు.
ఉపాధ్యాయులు ఈ చిత్రాన్ని “స్వాతంత్ర్య స్ఫూర్తిని కళ రూపంలో ప్రతిబింబించిన అందమైన సృష్టి” గా అభివర్ణించారు.
త్రివర్ణ పతాకం, దేశభక్తిని ప్రతిబింబించే ఈ చిత్రాన్ని చూసి ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ గౌస్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలింగారెడ్డి , గైడ్ టీచర్ మొహమ్మద్ ఫరీదుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయిని- ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు. విద్యార్థిని యొక్క ఈ సృజనాత్మక కృషి పాఠశాల గౌరవాన్ని మరింత పెంచిందన్నారు.