
✍️Ⓜ️🅰️K NEWS
_అక్రమంగా నిల్వఉంచిన రూ.20లక్షల స్టాక్ సీజ్
-ఫెర్టీలైజర్ &ఫెస్టి సీడ్స్ దుకాణాల దోపిడి పై వెల్లువెత్తున్న ఫిర్యాదులు
ఇల్లంతకుంట మండలం పొత్తూరు లోని ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్ షాపులపై ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలేన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకే సారి గురువారం గ్రామంలోని శ్రీరామ ఫెర్టీలైజర్ ఫెస్టీసీడ్స్, చంధ్రశేఖర్ ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్, శ్రీనివాస, రాజరాజేశ్వర దుకాణాలలో తనీఖీలు చేపట్టారు. ఓ వైపు మండలంలో తీవ్రంగా యూరియా కోరత ఏర్పడుతుందని, రైతులు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో ఈ మెరుపు దాడులతో ఒక్క సారిగా ఫేర్టీ లైజర్&ఫెస్టీ సీడ్స్ దుకాణాల లలో అలజడి నెలకొంది. గ్రామంలో డీసీఎంఎస్ గోదాంలను కూడా క్షున్నంగా తనీఖీ చేశారు. ప్రైవేటు డీలర్లకు సంభంధించిన గోదాంలలో, షాపులలో రోజువారి కి సంబంధించిన స్టాక్ కు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.19లక్షల71 వేల514 విలువ గల స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. రైతులకు అండగా నిల్వాల్సిన సమయంలో, ఎరువుల బస్తాలను ఎక్కువ మొత్తంలో రేటుకు అమ్ముతున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వారు తెలిపారు. ఎవరైన అక్రమంగా ఎరువుల బస్తా దాచిన, ఎక్కువ రేట్లకు అమ్మిన, కాలం చెల్లిన మందులను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విజిలేన్స్ తహసీల్దార్ దినేష్, చంద్రారెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ లు అనిల్ కుమార్, వరున్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ఎం సురేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

