
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు
-నీట్(NEET) లో ఎంబిబిఎస్ సీట్ సాధించిన గౌతమికి సన్మాణం
-పేదింటి బిడ్డకు ఎంబిబిఎస్ సీటు
ఇల్లంతకుంట/maknews కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని దాచారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాణి, ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు బాలగౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన, ప్రభుత్వప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చెప్యాల గౌతమి అనే విద్యార్థిని నీట్ (NEET)లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీంతో ఆమెకు కరీంనగర్ లోని (పీమ్స్) ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ చదవనుంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ చెప్యాలా గంగాధర్ కూతురు గౌతమికి ఎంబిబిఎస్ లో చోటు సాధించడం పట్ల, దాచారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందం తోపాటు గా గ్రామస్తులు,విద్యార్థులు “గౌతమి”కి సన్మానం చేశారు. ఈసంధర్భంగా గౌతమిని గ్రామస్థులు,ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల గౌడ్, ఉపాధ్యాయులు తుంకుంట నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ తో పాటుగా విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.