
-మాజీజడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు
maknews/ఇల్లంతకుంట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ,మాజీ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి “మాగంటి సునీత” ఘన విజయం సాధిస్తుందని మాజీ జడ్పీవైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి ఆయన, తోపాటుగా పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ,బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి (కేవీయన్ రెడ్డి) లతో కలిసి బయలు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ ఓట్లు సృష్టించిన, ధన ప్రవాహం చూపించిన, బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని వారు పేర్కొన్నారు.