
maknews/ఇల్లంతకుంట
మాజీ రాష్ట్రపతి,భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదువాలని ఎంఈఓ చెప్యాల గంగాధర్ సూచించారు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కందికట్కూరు ఎస్సీ కాలనీ లోని “రైలు బడి” పాఠశాలలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ,మరియు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు పూర్వ ఉపాధ్యాయులు, టీఆర్ టియూ రాష్ర్టఅసోసియేట్ మెంబర్ మనువాడ శంకర్ ,పాఠశాలకు వితరణ చేసిన డిక్షనరీ లను పెన్నులను మండల విద్యాధికారి చేప్యాల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం భారత దేశపు మాజీ రాష్ట్రపతిగా, మరియు క్షిపణి శాస్త్రవేత్తగా,దేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరు గావించి, మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు అనువోజు రాజు,విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.