
maknews/ఇల్లంతకుంట గర్భిణీ స్ర్రీలు, బాలింతలు పోషక విలువతతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలని అంగన్ వాడీ సిడిపివో ఉమారాణీ సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ‘పోషణ మాసం’ పురస్కరించుకుని అన్నప్రసాన, అక్షరభ్యాసం, శ్రీమంతం, కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్బంగా గర్బిణీ స్ర్రీలకు శ్రీమంతం చేశారు. పిల్లలకు అన్నప్రసాన, అక్షర భ్యాసం కార్యక్కమం స్థానిక ఎంపిడిఓ వై శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎంపిడిఓ శశికళ మాట్లాడుతూ బాలింతలు తప్పకుండా పిల్లలకు తమ పాలనే అందివ్వాలని, డబ్బ పాలను నిషేదించాలన్నారు. గర్బిణీ లు పాలు, కోడిగుడ్లు, చేపలు, ఆకుకురలు, పండ్లు, చిరుధాన్యాలను నానపెట్టుకుని తినాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ లు సూర్యకళ, చంద్రకళ, అంగన్ వాడీ టీచర్లు బైరి అరుణ, వొగ్గు విజయ, బాబాయి, వాణీ, తదితరులు పాల్గొన్నారు.