
maknews ఇల్లంతకుంట ….ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన భీమ్ యువసేన యూత్ నూతన అధ్యక్షునిగా కాసుపాక కిషన్ మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమ్ యువసేన యూత్ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునితో పాటుగా, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా కాసుపాక నవీన్ ప్రధాన కార్యదర్శిగా కాసుపాక శంకర్, సహాయ కార్యదర్శిగా కాసుపాక బాబు, కోశాధికారిగా కత్తెరపాక అనిల్ ను ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసుపాక శంకర్, కాసుపాక సురేష్, కాసుపాక రాజు, సాగర్ ,చందు, బాబు ,రాజశేఖర్ శ్రీకాంత్, రమేష్ ,శ్రీనివాస్, అరుణ్ సుమన్ ,మనోజ్, శ్రీనివాస్, సంతోష్ ,తదితరులు పాల్గొన్నారు.