
maknews సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని(డిసిసి)గా తనకు అవకాశం కల్పించాలని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పసుల వెంకటి కోరారు. ఈ మేరకు తన బయోడేటాను ఏఐసీసీ పరిశీలకులు మన్నె శ్రీనివాస్ కు బుధవారం అందజేశారు. అనంతరం వెంకటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 1995 నుండి కార్యకర్త నుంచి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో పదవులలో పని చేశానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను గుర్తిస్తుందని ఆశ బావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 50 పైగా అక్రమ కేసులు పెట్టారని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా తన పేరును పరిశీలించాలన్నారు. ఆయన వెంట మండల నాయకులు ఉన్నారు.