
సర్పంచ్ గా గెలిచిన యూట్యూబ్ స్టార్ శివాని
-యూట్యూబ్ స్టార్ నుంచి సర్పంచ్ గా ప్రయాణం..
యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ గౌరవేని శివాని సర్పంచ్ బరిలో విజయం సాధించి, సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటిమీది పల్లె గ్రామ సర్పంచి బరిలో నిలిచి ప్రత్యర్థి పై విజయం సాధించింది. బోటి మీద పల్లె గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన గౌరవేణి సుమన్ కు నాగర్ కర్నూలు చెందిన శివానికి గత ఏడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా వీరి ఇద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరు ఒక్కటై వివాహం చేసుకున్నారు. అప్పటినుండి సుమన్ శివాని లు ఇద్దరు పలు పాటలకు కొరియోగ్రాఫర్, తో పాటుగా డ్యాన్సులు చేస్తూ యూట్యూబ్లో ప్రాచుర్యం పొందారు. సుమారుగా శివాని 300కు పైగా పాటల్లో నృత్యాలు చేసి ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా నాగులమ్మో నాగులమ్మో నల్లనాగులమ్మ… చిన్న దొర బంగుల మీద… లాగలున్న దొడ్లేకు పెండ తీయపోమ్మటే ల్యాగలాట ఆడుతాడు సుడువదినే .. ఇలా 300కు పైగా పాటలకు సోలో పర్ఫార్మ్ చేస్తూ 50మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ స్టార్ట్ గా నిలిచింది. అయితే రెండో విడుతలో జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో బోటిమీద పల్లె సర్పంచ్ గా యూట్యూబ్ స్టార్ గౌరవేని శివాని పోటీలో నిలిచి, ప్రత్యర్థి పై గెలుపొంది సత్తా చాటింది. యూట్యూబ్ స్టార్ గెలుపొందడం పట్ల పలువురు సామాజిక మాధ్యమాల నుండి, ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

నన్ను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా..శివాని(సర్పంచ్)
నాపై నమ్మకంతో నన్ను ఎంతో హత్తుకొని గెలిపించిన ప్రజలందరికీ అభివృద్ధి చేసి చూపిస్తానని బోటు మీద పల్లె సర్పంచ్ గౌరవేని శివాని సుమన్ అన్నారు. యూట్యూబ్ ద్వారా నాకు ఎంతగానో పేరు వచ్చిందని, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తృప్తి ఎంతో గొప్పదన్నారు. గ్రామాన్ని సుందరి కరంగా అభివృద్ధి చేస్తానన్నారు.