
విదేశాల్లో చదివి… గ్రామ సర్పంచ్ గా ఎన్నిక
-ఊరిపై మమకారం సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు
-ఉన్నత చదువులు చదివిన గాలి పెళ్లి సర్పంచ్ శేఖర్ రెడ్డి
MAKNEWS/ ఇల్లంతకుంట
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఊరి పై మమకారంతో… సేవ చేయాలన్న సంకల్పంతో యువకుడు గ్రామ సర్పంచ్ బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోరాటాల పురిటి గడ్డ ,సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిన కామ్రెడ్ బద్దం ఎల్లారెడ్డి స్వగ్రామం “గాలి పెల్లి” గడ్డపై యువకుడు ఏకగ్రీవ సర్పంచి గా ఎన్నికై చరిత్ర సృష్టించాడు. గ్రామానికి చెందిన బద్దం వెంకటరెడ్డి- బద్దం విజయ దంపతుల కుమారుడు బద్దం శేఖర్ రెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బద్దం శేఖర్ రెడ్డి ఇంటర్ పూర్తి చేసి, కరీంనగర్ లోని విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ విద్యను అభ్యసించాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం నార్వే దేశానికి వెళ్లి అక్కడ ఎమ్మెస్(మాస్టర్ ఆఫ్ సైన్స్)పూర్తి చేశాడు. అక్కడ ఎమ్మెస్ పట్టా పొంది స్వగ్రామానికి వచ్చారు. గ్రామంలో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రైవేట్ ఆసుపత్రిని కరీంనగర్లో నెలకొల్పాడు . ప్రజలకు తక్కువ ఖర్చులో అధునాతనమైన మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించు కుంటు వస్తున్నాడు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల మన్నానాలు పొందాడు. క్రీడాపోటీలు ఏర్పాటు,సమాజసేవ చేస్తువచ్చాడు. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా గాలిపెల్లి జనరల్ స్థానం కేటాయించడంతో, బద్దం శేఖర్ రెడ్డి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. గ్రామంలో పలువురు కూడా పోటీలో నిలిచేందుకు ఉత్సాహం ప్రదర్శించగా, చివరగా గ్రామస్తులు అందరూ ఏకగ్రీవంగా శేఖర్ రెడ్డిని ఏకగ్రీవ సర్పంచిగాఎన్నుకొని చరిత్ర సృష్టించారు గ్రామంలో మొత్తం ఓటర్లు 2436 మంది ఓటర్లు ఉన్నారు.
సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా: బద్ధం శేఖర్ రెడ్డి సర్పంచ్
ప్రజలకు సేవ చేయాలనే ధృడ సంకల్పంతో రాజకీయంలోకి వచ్చానని, ఏకగ్రీవ సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించామని, మరింత ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గాలి పెల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి , మరింత సమాజసేవ తన వంతుగా చేస్తానని “మన తెలంగాణ” తో తెలిపారు.