
**ఇల్లంతకుంట ఉప సర్పంచ్ గా మూగు నాగరాజు శర్మ
మంత్రోచ్ఛారణతో, నిత్యం దేవుడు సన్నిధిలో పూజలు, అభిషేకాలు నిర్వహించే ప్రముఖ పురోహితుడిని, ఉపసర్పంచ్ పీఠం వరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పట్టణంలో ప్రముఖ పురోహితుడు, జ్యోతిష్యకుడు మూగు నాగరాజు శర్మ మూడో వార్డు లోవార్డు మెంబర్ గా బరి లో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వెంటనే ఉపసర్పంచి ఏర్పాటు చేయాలని అధికారులు సూచించడంతో, మొత్తం 12 వార్డు సభ్యులు గాను ఏడుగురు వార్డు సభ్యులు అయ్యగారే ఉపసర్పంచ్ కావాలని చేతులు ఎత్తడంతో, ఎన్నికల అధికారి గ్రామ పురోహితుడుని ఉప సర్పంచ్ గా ప్రకటించారు. దీంతో అయ్యగారు కాస్త ఉపసర్పంచ్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగరాజు శర్మ పలు సామాజిక సేవలను చేసుకుంటూ వస్తూ, చాలామంది నిరుపేదలకు పుస్తె మటన్ అందిస్తూ, ప్రజా సేవలో ఉండడంతో తనను పదవి వరించిందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా.. నాగరాజు శర్మ
తనను ఆదరించి గెలిపించిన వార్డు ప్రజలందరికీ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని మూగు నాగరాజు శర్మ తెలిపారు. అదేవిధంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా తన వంతు సహాయం అందిస్తానన్నారు. అంతేకాకుండా నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయని పంతులు ఉప సర్పంచ్ నాగరాజు శర్మ తెలిపారు.