
maknews
-మరో దూడకు తీవ్రగాయాలు
-తిప్పాపూర్,పెద్దలింగార్ లో పులి కలకలం
-పులికోసం ఫారెస్ట్ అధికారులు, స్పెషల్ రెస్క్యూటీం గాలింపు
-ట్రాప్ కెమేరాల ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పా పూర్, పెద్ద లింగా పూర్ గ్రామ శివారులో పెద్దపులి కలకలం సృష్టించింది. మూడు ఆవు దూడలపై పులి పంజా విసరణతో.. అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో ఆవుదుడా తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. పెద్దలింగాపూర్ కు చెందిన రైతు గుర్రాల మల్లయ్య కోరేంమల్లయ్య కు చెందిన 3 ఆవులు, తిప్పాపూర్ గ్రామానికి చెందిన కోరం సుధాకర్ కు చెందిన ఆవు దూడపై పెద్ద పులి దాడి చేసింది. తిప్పా పూర్ – పెద్ద లింగా పూర్ రోడ్డు పై కల్వర్టు సమీపంలోని గుట్టలను ఆనుకొని ఉన్న రైతుల పొలాల వద్ద కట్టి వేసి ఉన్న 3 ఆవులను, ఒక ఆవు దూడను సోమవారం రాత్రి పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. మంగళవారం ఉదయం రైతులు తమ పొలాల వద్దకు వెళ్లగా కట్టేసి ఉన్న పశువులు మెడలపై, తీవ్ర గాయాలతో రక్తం కారుతూ దాడి చేసిన గాయాలతో మృతి చెంది ఉన్నాయి. దీంతో పక్కనే పులి పులి ఆడవాళ్లు కనిపించాయి. గత వారం రోజుల క్రితం సిద్దిపేట్ జిల్లాలోని కోహెడ మండలంలో పులి సంచరిస్తుందన్న నేపథ్యంలో , మళ్లీ గత 3 రోజులుగా సిద్దిపేట్ జిల్లా చిన్న కోడూర్ మండలం విఠలా పూర్ , కిష్టాపూర్ ప్రాంతం గుట్టల్లో పులి సంచారిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రలు నిర్ధారణ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా సిద్దిపేట్ జిల్లా సరిహద్దులో ఉన్న ఇల్లంతకుంట మండలం లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పెద్ద లింగా పూర్ రైతుల ఆవులపై పెద్ద పులి దాడి చేసి హతమార్చడంతో పరిసర గ్రామాల్లో కలకలం రేపుతుంది. ఫారెస్ట్ అధికారులు మరియు పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరీశీలన కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో పెద్ద పులి పాద ముద్రల ఆనవాళ్లు స్పష్టంగానె కనిపిస్తున్నాయి. కాగా మొదట సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో సంచరిస్తుందని తెలిసిన పులి మళ్ళీ ఇదే సిద్దిపేట్ జిల్లా చిన్న కోడూర్ మండలం విఠలాపూర్ , కిష్టాపూర్ పరిసర ప్రాంత గుట్టల్లో సంచారించిన పులి నేడు ఇల్లంతకుంట మండలం తిప్పా పూర్ సమీపంలోని గుట్టల వద్ద గల పొలాల వచ్చిందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వస్తున్నారు. గత కొన్ని రోజులుగా అటు సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో పులుసంచారం ఏర్పడడం, అదే పులి ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ తిప్పాపూర్ లో ప్రవేశించి పశువులపై దాడి చేసిందని భావిస్తున్నారు.

పులి కోసం రెస్క్యూ టీం తో గాలింపు
మూడు ఆవులను చంపిన పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ సిహెచ్ బాలమణి నేతృత్వంలో ప్రత్యేక టీంను రంగాల్లోకి దించారు. మహారాష్ట్ర హైదరాబాద్ కు చెందిన పులిని బంధించే ప్రత్యేక టీంను రంగంలోకి దింపినట్టుగా వారు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందావొద్దని, పంట పొలాలకు వెళ్లే రైతులు ఫారెస్ట్ అధికారులు చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించాలన్నారు.
పెద్దపులి కోసం ట్రాప్ కెమెరాలో ఏర్పాటు
పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తిప్పాపూర్ పెద్ద లింగాపూర్ అనంతగిరి సిరికొండ ప్రాంతాల వద్ద ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ట్రాప్ కెమెరాలను అమర్చినట్టు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. మొదటగా పూర్తిస్థాయిలో పులిని గుర్తించాలని వారు పేర్కొన్నారు.

భయాందోళనలో పరిసరాల రైతులు
ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ పెద్ద లింగాపూర్ శివారులో గల రైతుల పశువుల చంపిన పులి సంచారంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. పులి సంసారం వార్తలతో ప్రజలు అటు రైతులు భయం భయంగా ఉన్నారు. పెద్దపులి సంచారం నెలకొన్న నేపథ్యంలో పులి ఎప్పుడు దాడి చేస్తుందో అనే ఆందోళన నెలకొంది.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎస్సై అశోక్ కుమార్
ఇల్లంతకుంట మండలంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్ళాము రైతులు కట్టలను ఇతర సేఫ్టీ వస్తువులను తీసుకెళ్లాలని కోరారు. రాత్రి వేళలో పశువులను వ్యవసాయ భూముల వద్ద కట్టవేయొద్దని, ఇంటి వద్ద సేఫ్ గా ఉండే విధంగా కట్టెయ్యాలని కోరారు. ప్రజలకు పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
