
ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్
✍️Ⓜ️🅰️K NEWS
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వహకులు ఆన్ లైన్ లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రులను యువత భక్తి శ్రద్ధలతోనిర్వహించుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ చేపట్టుతామన్నారు. తప్పనిసరిగా వినాయక మండపంలో రోజు రాత్రి యువకులు నిద్రించాలని సూచించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే 100 సమాచారం అందించాలన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈ కింది పోర్టల్ ద్వారా చేసుకోవాలని ఆయన సూచించారు. గణేష్ చతుర్థి ఆన్లైన్ అప్లికేషన్ పోలీస్ పోర్టల్ ద్వారా..
MAKNEWSTV
https://policeportal.tspolice.gov.in/
GANESH APPLICATION RELATED URL
రాబోయే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా విగ్రహ స్థాపన, శోభాయాత్రలు నిర్వహించుకోవడానికి అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా పోలీస్ పోర్టల్ (https://policeportal.tspolice.gov.in/) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు ఎవరైనా ఈ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని అనుమతులను పొందవచ్చని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సులభతరంగా అనుమతులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.