
సోమారంపేటలో ఫ్రీ టెంట్ వెస్తానన్న అభ్యర్థి గెలుపు
maknews/ఇల్లంతకుంట :రెండో విడత లో జరిగిన స్థానిక సంస్థల సమరంలో అభ్యర్థులు వారి యొక్క వాగ్దానం విభిన్న రూపంలో ప్రజలకు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారం పేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి భారతమ్మ లక్ష్మారెడ్డి లు గ్రామ ప్రజలకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. తాము సర్పంచిగా గెలిస్తే గ్రామ ప్రజలందరికీ శుభాకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఉచితంగా (ఫ్రీ) టెంట్ వేస్తామని జనాలకు హామీ ఇచ్చారు . దీంతో 14న ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై విజయం సాధించి టెంట్ ఫ్రీ తో ప్రజల ముందుకు వెళ్లిన సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి భారతమ్మ లక్ష్మారెడ్డిలో ట్రెండ్ సృష్టించి సర్పంచిగా గెలుపొందారు. తన ప్రచారంలో కూడా టెంట్ ఫ్రీ అంటూ ప్రజలకు వివరించాడు. టెంట్ ఫ్రీ ఫ్రీ అన్న సర్పంచ్ గెలవడంపై సర్పంచ్ మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
